ఖమ్మం నగరపాలక సంస్థ ఎన్నికల్లో జనసేన పార్టీ ఒంటరిగా పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి ప్రకటించారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుని ఎన్నికల ప్రచారం నిర్వహిస్తామని పేర్కొన్నారు. యువత, మహిళలు, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారానికి జనసేన కృషి చేస్తుందని చెప్పారు. ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి జనసేన సత్తా చాటాలని రామ్ తాల్లూరి పిలుపునిచ్చారు.



