జనసేన పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న ఖమ్మం ఎంబీ గార్డెన్స్‌లో నిర్వహించనున్న ‘జనసేన శంకరావం’ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఖమ్మంలో జరిగిన కార్యక్రమంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాల్లూరి, రాష్ట్ర అధికార ప్రతినిధి గడీల శ్రీనివాస్, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి మిర్యాల రామకృష్ణ పాల్గొని పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శంకరావం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జనసేన శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, తెలంగాణలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై కార్యక్రమంలో చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని నాయకులు సూచించారు.



