కోడేరు: మండలంలోని 16 గ్రామపంచాయతీల పరిధిలోని హ్యాబిటేషన్లలో ఉపాధి హామీ కూలీలకు కచ్చితంగా డిమాండ్ జనరేషన్ (డిమాండ్ ఎలక్ట్రిషన్) చేయాలని ఎంపీడీవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం నాటికి ప్రతి పంచాయతీ పరిధిలో కనీసం వంద మంది కూలీలను పనులకు తీసుకెళ్లాలని స్పష్టం చేశారు. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఉపాధి పనుల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Uploaded Video:

