*మొదలైన పెన్షన్ ల పండుగ*
కీర్తిరాయునిగూడెం (మైలవరం రూరల్) 07.09.2026
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మైలవరం మండలం కీర్తిరాయునిగూడెం గ్రామంలోని సచివాలయం నందు అర్హులైన పెన్షన్ లబ్ధిదారులు సంబంధిత సచివాలయ అధికారులకు దరఖాస్తులు అందజేయడానికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ పాల్గొని కూటమి ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ విడతల వారీగా పెన్షన్ అందజేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కూటమి ప్రభుత్వం లబ్ధిదారులకు అధిక మొత్తంలో 4000,6000,10000,15000 నెలలోని మొదటి రోజే కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయిలో లేకపోయిన ఏ ఒక్క సంక్షేమం ఆపకుండా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందజేస్తుందన్నారు .




