విదేశీ నిధులు స్వీకరించే స్వచ్ఛంద సంస్థల (NGOs)పై కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేసింది. ఇకపై సంస్థలు తమ కార్యకలాపాలు, సేవల పరిధి, వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు, ప్రచురణల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలి. అనుమతించిన కార్యకలాపాలకే విదేశీ నిధులను వినియోగించాల్సి ఉంటుంది. నిబంధనల ఉల్లంఘనకు కనీసం ₹1 లక్ష జరిమానా విధించనున్నారు. ఈ నిర్ణయం విదేశీ నిధుల వినియోగంలో పారదర్శకతను పెంచేందుకు తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్రం విదేశీ విరాళాల నిబంధనలను కఠినతరం చేసింది