కురిమిద్ద తండా దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా నాలుగు గ్రామాల ఫార్మాసిటీ పోరాట కమిటీ రైతులు…
గతంలో ఇచ్చిన హమీలను నిలబెట్టుకోవాలని రైతులు నిరసన దీక్ష చేస్తున్నారు.
పున్నమి న్యూస్ ప్రతినిధి
23 మార్చి 2026
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ :
గత మూడు రోజుల నుంచి కురిమిద్ద తండా దగ్గర నిరాహార దీక్ష చేస్తున్న రైతులకు మద్దతుగా నాలుగు గ్రామాల ఫార్మాసిటీ పోరాట కమిటీ రైతులందరూ పాల్గొన్నారు. హైకోర్టు అవార్డులు రద్దు చేసి, తీసుకున్న భూముల్లో కూడా ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశాలు ఉన్నా కూడా చట్ట వ్యతిరేకంగా గిరిజన రైతులను భయభ్రాంతులకు గురిచేసి రోడ్డు వేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం, కోర్టు దిక్కరణ.
ఇప్పుడు ప్రభుత్వంలో నాయకులు, గత ప్రభుత్వ హయాంలో అప్పుడు చట్ట వ్యతిరేకంగా చేస్తున్న నిర్మాణ పనులు అడ్డుకోన్నారు. మూడు పంటలు పండే భూములు తీసుకోవడానికి లేదని, ఇప్పుడున్న మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ మాకు అప్పుడు అండగా ఉన్నారు. కానీ పదవులు వచ్చినాక మా సమస్యలు పరిష్కారం చేయటం లేదు. ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తున్నారు మేము రైతులం మీకు కనబడటం లేదా? గతంలో మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా రైతుల దగ్గర భూములు తీసుకుంటుందని కురుమిద్ద గ్రామంలో నిరాహార దీక్ష చేపించడం జరిగింది. కానీ ఇప్పుడు అదే భూములని మీరు అక్రమంగా గుంజుకుంటున్నారు. గతంలో ఇచ్చిన హమీ ని నిలబెట్టుకోవాలని రైతులు నిరసన దీక్ష చేస్తున్నారు. గతంలో మీరు మా ప్రభుత్వం వస్తే ఇవ్వని భూములని తీసుకోమని, ఫార్మా సిటీ రద్దు చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఫార్మా సిటీ జి. ఓ ఎందుకు రద్దు చెయ్యలేదు, భూములు ఇయ్యాలని ఎందుకు బలవంతం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాము. ఇప్పటికైనా రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాం. లేకుంటే త్వరలో మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది.
ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ
కవుల సరస్వతి, కానమోని గణేష్ మహిపాల్ రెడ్డి నేనావత్ శ్రీకాంత్ భగవంతు రెడ్డి అనసూయమ్మ, సిద్ధం రవి, ఉడతల పెంటయ్య, బూర సత్తయ్య, అందెకర్ దేవోజి మరియు రైతులందరూ పాల్గొనడం జరిగింది.




