Thursday, 10 September 2026
  • Home  
  • కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష
- ఖమ్మం

కిడ్నాప్‌ కేసులో ముగ్గురికి మూడేళ్ల కఠిన కారాగార శిక్ష

ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2018లో నమోదైన కిడ్నాప్‌ కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి అరవ ప్రవీణ్ తీర్పు వెలువరించారు. ఈ వివరాలను త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ J. మోహన్‌ బాబు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కొక్కరు అదనంగా మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కేసు వివరాల ప్రకారం.. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో Cr.No.83/2018 U/s 365 IPC, CC.No.285/2018గా నమోదైన కేసులో చక్కిలెల @ నాగమళ్ల సతీష్ (A1), చక్కిలెల సంతోష్ (A2), చక్కిలెల సుమన్ (A3) నిందితులుగా ఉన్నారు. 2018 ఏప్రిల్‌ 20న రాత్రి కిన్నెరసాని థియేటర్‌ ఎదురుగా ఉన్న కిరాణా జాగిరి మర్చంట్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ కార్యక్రమం వద్ద కొత్త విశ్వనాధంతో గొడవపడి, అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్‌ చేసి, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి భార్య కొత్త గీత ఏప్రిల్‌ 21న త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్‌ U. వెంకన్న బాబు (ప్రస్తుతం DSP, ఇల్లందు) కాగా, బ్రీఫింగ్‌ ఆఫీసర్‌గా ఇన్స్పెక్టర్‌ J. మోహన్‌ బాబు, APP S. గాయత్రి సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. CDO V. రామకృష్ణ, కోర్టు లైజన్‌ అధికారులు K. శ్రీకాంత్ (SI), K. శ్రీనివాస్ (HC), D. నాగేశ్వరరావు (HC) సహకరించారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్ అభినందించారు.

ఖమ్మం త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో 2018లో నమోదైన కిడ్నాప్‌ కేసులో ముగ్గురు నిందితులకు మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి, జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయమూర్తి అరవ ప్రవీణ్ తీర్పు వెలువరించారు. ఈ వివరాలను త్రీ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ J. మోహన్‌ బాబు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో ఒక్కొక్కరు అదనంగా మూడు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

కేసు వివరాల ప్రకారం.. త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో Cr.No.83/2018 U/s 365 IPC, CC.No.285/2018గా నమోదైన కేసులో చక్కిలెల @ నాగమళ్ల సతీష్ (A1), చక్కిలెల సంతోష్ (A2), చక్కిలెల సుమన్ (A3) నిందితులుగా ఉన్నారు. 2018 ఏప్రిల్‌ 20న రాత్రి కిన్నెరసాని థియేటర్‌ ఎదురుగా ఉన్న కిరాణా జాగిరి మర్చంట్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన వివాహ కార్యక్రమం వద్ద కొత్త విశ్వనాధంతో గొడవపడి, అతడిని బలవంతంగా కారులో ఎక్కించుకొని కిడ్నాప్‌ చేసి, రహస్య ప్రదేశంలో అక్రమంగా నిర్బంధించినట్లు పోలీసులు తెలిపారు.

బాధితుడి భార్య కొత్త గీత ఏప్రిల్‌ 21న త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేశారు. అప్పటి దర్యాప్తు అధికారి ఇన్స్పెక్టర్‌ U. వెంకన్న బాబు (ప్రస్తుతం DSP, ఇల్లందు) కాగా, బ్రీఫింగ్‌ ఆఫీసర్‌గా ఇన్స్పెక్టర్‌ J. మోహన్‌ బాబు, APP S. గాయత్రి సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌ నిర్వహించారు. CDO V. రామకృష్ణ, కోర్టు లైజన్‌ అధికారులు K. శ్రీకాంత్ (SI), K. శ్రీనివాస్ (HC), D. నాగేశ్వరరావు (HC) సహకరించారు. ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్‌ కమిషనర్‌ సునీల్‌ దత్ అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.