నందిగామ మున్సిపాలిటీ 4వ వార్డులోని కాకులయ్య వీధిలో మురుగునీటి సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. తుర్లపాటి మార్కండేశ్వరరావు ఇంటి సమీపంలోని మురికి కాలువ నుంచి నీరు సక్రమంగా ప్రవహించక రోడ్డుపైకి చేరి బజారులోని ఇళ్ల ముందు నిల్వ ఉంటోందని స్థానికులు తెలిపారు.చాలా రోజులుగా మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతుండగా, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని పలుమార్లు మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులుఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్ల వద్ద మురుగునీరు నిల్వ ఉండటం తో దోమలు విపరీతంగా పెరిగి జ్వరాలు, ఇతర అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం నెలకొందని వారు పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలువను శుభ్రపరచి మురుగునీరు సాఫీగా వెళ్లేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.
Uploaded Video:


