పెనగలూరు: అన్‌స్కిల్డ్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ నాయకుడు సీహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. గురువారం పెనగలూరు మండల ఎండీఓ కార్యాలయ ఆవరణలో సీఐటీయూ మండల సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు, వీఓఏలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఇతర స్కీం వర్కర్ల వేతనాలు రూ.10 వేలకుపైగా పెరగలేదన్నారు. విద్యుత్ ఆపరేటర్లు, వీఆర్ఏలు, ఫీల్డ్ అసిస్టెంట్ల వేతనాలను కూడా పెంచాలని కోరారు. శాశ్వత పనుల్లో పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ అనుబంధ సంఘాలు సమన్వయంతో ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఐటీయూ మండల సమన్వయ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా ఏ.శిరీష, కో-కన్వీనర్లుగా డి.సుబ్బనరసింహులు, చిన్నా, పుష్పాంజలి ఎన్నికయ్యారు. సభ్యులుగా సుమంత్, నరసింహ, గోపి, సుజాత, లత, చంద్రకళ, సుబ్రహ్మణ్యం, అరుణ తదితరులు ఎన్నికయ్యారు.

కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి