Sunday, 16 August 2026
  • Home  
  • కాంగ్రెస్ బలోపేతానికి KKC శ్రేణులు కృషి చేయాలి: రాష్ట్ర నేతలు వి. మెహన్ నాయక్, రుద్రాక్ష మల్లేష్ పిలుపు
- ఖమ్మం

కాంగ్రెస్ బలోపేతానికి KKC శ్రేణులు కృషి చేయాలి: రాష్ట్ర నేతలు వి. మెహన్ నాయక్, రుద్రాక్ష మల్లేష్ పిలుపు

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో KKC జిల్లా అధ్యక్షులు సిహెచ్. విప్లవ కుమార్ పటేల్ అధ్యక్షతన KKC జిల్లా సమావేశం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి KKC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. మోహన్ నాయక్, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. కార్మిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ అండగా ఉంటుందని, కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పార్టీ నిరంతరం పోరాడుతోందని నాయకులు తెలిపారు. అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గృహ కార్మికులు, చిరు వ్యాపారులు, గిగ్ వర్కర్లు, రోజువారీ కూలీల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు KKCను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, ప్రమాద బీమా, పెన్షన్, ఆరోగ్య సదుపాయాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో KKC ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గయాజ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు డిమార్ట్ జానీ, KKC త్రీ టౌన్ అధ్యక్షులు రాజు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో KKC జిల్లా అధ్యక్షులు సిహెచ్. విప్లవ కుమార్ పటేల్ అధ్యక్షతన KKC జిల్లా సమావేశం ఘనంగా నిర్వహించారు. సమావేశానికి KKC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. మోహన్ నాయక్, ఆటో యూనియన్ ప్రధాన కార్యదర్శి రుద్రాక్ష మల్లేష్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు.

కార్మిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ అండగా ఉంటుందని, కార్మికుల హక్కులు, సంక్షేమం, సామాజిక న్యాయం కోసం పార్టీ నిరంతరం పోరాడుతోందని నాయకులు తెలిపారు. అసంఘటిత కార్మికులు, ఆటో డ్రైవర్లు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, గృహ కార్మికులు, చిరు వ్యాపారులు, గిగ్ వర్కర్లు, రోజువారీ కూలీల సమస్యలను గుర్తించి పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లాలో కాంగ్రెస్ పార్టీతో పాటు KKCను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయాలని సూచించారు. కార్మికులకు ఉపాధి, సామాజిక భద్రత, ప్రమాద బీమా, పెన్షన్, ఆరోగ్య సదుపాయాలు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో KKC ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు జంగిపల్లి ప్రసాద్, పార్లమెంట్ అధ్యక్షులు మెరుగు వెంకట నాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి గయాజ్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు డిమార్ట్ జానీ, KKC త్రీ టౌన్ అధ్యక్షులు రాజు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.