పెనుబల్లి / ఖమ్మం
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ముత్తగూడెం సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మున్సిపాలిటీ 1వ వార్డు బీసీ కాలనీకి చెందిన కడారి రాకేష్ మృతి చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న రాకేష్‌ను కంటైనర్ ఢీకొనడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. ప్రమాదంలో రాకేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వంగా ముత్యాలబంజర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుబల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.



