పున్నమి తెలుగు దిన పత్రిక ✍
ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు.గడిచిన 24 గంటల్లో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా ..41 మంది డిశ్చార్జ్ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.నిన్న ఒకరు మృతి చెందగా..మొత్తం మృతుల సంఖ్య 54కి చేరింది.కొత్తగా వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రంలో కేసుల సంఖ్య 2452కి చేరింది. ప్రస్తుతం 718 యాక్టివ్ కేసులు ఉండగా..1680 మంది ఇప్పటివరకు డిశ్చార్జ్ అయ్యారు.