సేవా సంకల్ప అభియాన్‌లో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం
పున్నమి ప్రతినిధి ఆనంద్ ( జిల్లా బ్యూరో)
ఏటికొప్పాక: ఎలమంచిలి రూరల్ మండలం ఏటికొప్పాక గ్రామంలో సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా అంగన్వాడీ ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు అగ్రహారపు కుమారస్వామి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామంలోని ఆరు అంగన్వాడీ కేంద్రాల టీచర్లను శాలువాలతో ఘనంగా సత్కరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు అందుతున్న సేవలను గుర్తిస్తూ టీచర్లను అభినందించారు. చిన్నారుల ఆరోగ్యం, విద్య, పోషణలో అంగన్వాడీ సిబ్బంది చేస్తున్న సేవలు ప్రశంసనీయమని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి నూకరాజు, మండల యువమోర్చా అధ్యక్షులు కడారి అప్పలరాజు, మండల కిసాన్ మోర్చా కార్యదర్శి సురేష్ తదితరులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.

