నర్సంపేట నియోజకవర్గం, ఖానాపూర్ మండలం, బుధరావుపేట్ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు గిరిజనులకు, ఎస్టీలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని మండిపడ్డారు. ఎస్టీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారని విమర్శించారు.
వెంటనే క్రింది హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు:
ఎస్టీ రిజర్వేషన్ ను 12% కి పెంచాలని, పెండింగ్ లో ఉన్న జీవోను వెంటనే అమలు చేయాలి.పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజన రైతులందరికీ వెంటనే పట్టాలు ఇవ్వాలి.
గిరిజన బంధు, గిరిజన రైతులకు ఇస్తామన్న ఆర్థిక సహాయం వెంటనే విడుదల చేయాలి.
బుధరావుపేట్, ఖానాపూర్ మండలంలోని గిరిజన తండాలు, గూడేలలో నెలకొన్న రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించాలి.
గిరిజన విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు, ఫీజు రీయింబర్స్ మెంట్ వెంటనే ఇవ్వాలి.
కెసిఆర్ హయాంలో గిరిజనులకు ఇచ్చిన గౌరవం, ఇప్పుడు లేదని, ఈ ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని వారు ఆరోపించారు. హామీలు నెరవేర్చని పక్షంలో తండాలు, గూడేల నుండి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా మాజీ ఓ డి సి ఎం ఎస్ గుగులోతు రామస్వామి నాయక్ గారు మరియు ఖానాపూర్ మండల్ మాజీ ఎంపీపీ జాటోతు సోదరులాల్ గారు మరియు ఖానాపూర్ మండల్ మాజీ జెడ్పిటిసి గుగులోతు బాలు గారు మరియు ఖానాపూర్ మండల్ వైస్ ఎంపీపీ జాటోతు బాలు నాయక్ గారు మరియు సర్పంచులు బాలకిషన్ గారు లకావత్ ప్రవీణ్ గారు, బానోతు వీరన్న గారు, గొంది నాగేశ్వరరావు గారు, మాజీ సర్పంచులు బాదావత్ హాట్యనాయక్ గారు, గుగులోతు సుమన్ గారు మరియు ఉప సర్పంచ్ హర్కావత్ కిషన్ గారు మరియు మండల నాయకులు గొంది నరసయ్య గారు, వజ్జ రమణయ్య గారు, బిఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షులు జాటోత్ రమేష్ గారు మరియు దారావత్ దేవేందర్ గారు మాజీ ప్రజా ప్రతినిధులు గిరిజన నాయకులు బీఆర్ఎస్ గిరిజన అధ్యక్షులు, యూత్ నాయకులు, గిరిజన సెల్ నాయకులు , కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.



