మైపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు గంపల సుబ్రమణ్యం పార్టీకి చేసిన సేవలకు గుర్తింపు లభిస్తున్న సందర్భంగా CS Developers MD బండ్ల చంద్రశేఖర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. స్థానికంగా కళ్యాణ్ రెడ్డి సూచించిన ప్రతి కార్యక్రమాన్ని నమ్మకంగా నిర్వహిస్తూ, టీడీపీ నాయకులతో ఎంతోకాలంగా కలిసిమెలిసి పనిచేసి, ఇందుకూరుపేట మండలం–కోవూరు నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాల విజయానికి సుబ్రమణ్యం కృషి చేశారని పేర్కొన్నారు.
మైపాడు టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నందుకు నారా లోకేష్ చేతుల మీదుగా అవార్డు స్వీకరించనున్న సందర్భం ఎంతో సంతోషకరమని తెలిపారు. స్థానిక ప్రజలు, బంధువులు, శ్రేయోభిలాషులు, CS Developers టీమ్ లీడర్లు, అడ్వైజర్లు ఆయనకు అభినందనలు తెలియజేశారు. “మంచి మనిషికి మంచి గుర్తింపు” లభించడం ఆనందంగా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

