పున్నమి ప్రతినిధి వేముల:
(న్యూస్):వేముల మండలంలోని , భూమయ్యగారిపల్లె, రాచకుంటపల్లి గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మండల వ్యవసాయ అధికారి G.P ఓబులేసు వారి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి వారి సూచనలు మేరకు ప్రస్తుత పరిస్థితులలో ఎల్ నినో వాతావరణ మార్పుల వల్ల వర్షాలు సరైన సమయానికి పడకపోవచ్చు , కావున రైతులందరూ స్వల్ప కాలిక పంటలు అయినటువంటి కందులు, మినుములు ఇతర చిరుధాన్యాలను సాగు చేసుకోవాలని తెలియజేశారు.
ప్రస్తుత వేసుకున్న పంటలకు నీటి ఎద్దడి రాకుండా ప్రభుత్వం డ్రిప్పులు మరియు స్ప్రింక్లర్లు సబ్సిడీలు అందిస్తుందని ఈ అవకాశాన్ని రైతులు వాడుకోవాలని తెలియజేశారు.
అంతేగాక ప్రస్తుత పంటలు నీటి ఎద్దడి గురైనప్పుడు 19:19:19 రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని తద్వారా పంట నీటి ఎద్దడి నుండి కోలుకుంటుంది అని తెలియజేశారు.
ప్రభుత్వ పథకాలు అయినటువంటి క్రాప్ ఇన్సూరెన్స్ ఈ నెల 31 తారీకు లోగా దరఖాస్తు చేసుకోవాలని ఇంకోసారి గడువును ప్రభుత్వం పొడిగించదని, కావున ఈ అవకాశాన్ని రైతులందరూ వాడుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ ,ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.





