Sunday, 13 September 2026
  • Home  
  • ఎరుకువానిపాలెంలో పర్యావరణ రక్షాబంధన్ వేడుకలు(ఎంపీయూపీ పాఠశాల)
- అనకాపల్లి

ఎరుకువానిపాలెంలో పర్యావరణ రక్షాబంధన్ వేడుకలు(ఎంపీయూపీ పాఠశాల)

అనకాపల్లి జిల్లా , ఆగస్టు 28: ఎంపీయూపీ పాఠశాల – ఎరుకువానిపాలెంలో నేడు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా, పర్యావరణ పరిరక్షణ సందేశంతో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ స్వయంకృషితో పర్యావరణహిత రాఖీలను తయారు చేశారు. రక్షాబంధన్‌ను వినూత్నంగా నిర్వహిస్తూ, విద్యార్థులు తయారు చేసిన రాఖీలను పాఠశాల ఆవరణలోని చెట్లకు కట్టి, “చెట్లను కూడా మన సోదరుల్లా రక్షించాలి” అనే సందేశాన్ని అందించారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహనను ప్రధాన ఉపాధ్యాయలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విద్యార్థుల్లో పెంపొందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.పీ.బి. శ్రీధర్, ఉపాధ్యాయులు శ్రీమతి జయశ్రీ రాణి, శ్రీమతి సుజాత, శ్రీమతి ఉమ , శ్రీ కృష్ణారావు , శ్రీ మూర్తి , అలాగే SMC చైర్మన్ అరిగా శ్రీను పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి భానుమతి గారు,పద్మిని,లక్ష్మి,శ్రీలక్ష్మి అతిథులుగా హాజరై విద్యార్థులకు రాఖీలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు పండ్లను పంపిణీ చేసి, వారితో ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులను అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అతిథులు ప్రశంసించారు. విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకతను, పర్యావరణంపై వారికున్న బాధ్యతను ఉపాధ్యాయులు అభినందించారు. సంప్రదాయ పండుగలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానిస్తూ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రకృతి ప్రేమ, విలువలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. “చెట్లకు రాఖీ – ప్రకృతికి రక్షణ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు అతిథుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల నూతన స్ఫూర్తిని నింపింది.

అనకాపల్లి జిల్లా , ఆగస్టు 28:

ఎంపీయూపీ పాఠశాల – ఎరుకువానిపాలెంలో నేడు రక్షాబంధన్ వేడుకలను అత్యంత ఘనంగా, పర్యావరణ పరిరక్షణ సందేశంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు తమ స్వయంకృషితో పర్యావరణహిత రాఖీలను తయారు చేశారు. రక్షాబంధన్‌ను వినూత్నంగా నిర్వహిస్తూ, విద్యార్థులు తయారు చేసిన రాఖీలను పాఠశాల ఆవరణలోని చెట్లకు కట్టి, “చెట్లను కూడా మన సోదరుల్లా రక్షించాలి” అనే సందేశాన్ని అందించారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అనే అవగాహనను ప్రధాన ఉపాధ్యాయలు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొణతాల ఫణి భూషణ్ శ్రీధర్ విద్యార్థుల్లో పెంపొందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు శ్రీ కె.పీ.బి. శ్రీధర్, ఉపాధ్యాయులు శ్రీమతి జయశ్రీ రాణి, శ్రీమతి సుజాత, శ్రీమతి ఉమ , శ్రీ కృష్ణారావు , శ్రీ మూర్తి , అలాగే SMC చైర్మన్ అరిగా శ్రీను పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి శ్రీమతి భానుమతి గారు,పద్మిని,లక్ష్మి,శ్రీలక్ష్మి అతిథులుగా హాజరై విద్యార్థులకు రాఖీలను పంపిణీ చేశారు. అనంతరం చిన్నారులకు పండ్లను పంపిణీ చేసి, వారితో ఆనందాన్ని పంచుకున్నారు. విద్యార్థులను అభినందిస్తూ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని అతిథులు ప్రశంసించారు.
విద్యార్థులు ప్రదర్శించిన సృజనాత్మకతను, పర్యావరణంపై వారికున్న బాధ్యతను ఉపాధ్యాయులు అభినందించారు. సంప్రదాయ పండుగలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానిస్తూ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో సామాజిక బాధ్యత, ప్రకృతి ప్రేమ, విలువలు పెంపొందుతాయని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.
“చెట్లకు రాఖీ – ప్రకృతికి రక్షణ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు అతిథుల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల నూతన స్ఫూర్తిని నింపింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.