Wednesday, 16 September 2026
  • Home  
  • ఎయిడ్స్ రహిత భవిష్యత్తు మన లక్ష్యం అంటూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన బీమాబాయి మహిళా మండల
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎయిడ్స్ రహిత భవిష్యత్తు మన లక్ష్యం అంటూ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన బీమాబాయి మహిళా మండల

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో శనివారం బీమాబాయి మహిళా మండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలకు అనుగుణంగా విస్తృత ప్రచార కార్యక్రమం 2026ను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులతో నిర్వహించిన ర్యాలీలో సాధికారత కలిగిన యువత, బలోపేతమై న సమాజాలు, ఎయిడ్స్ రహిత భవిష్యత్తు అనే అంశాలపై నినాదాలు చేస్తూ స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. హెచ్ఐవి స్థాయిని తెలుసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రచారం చేశారు. అనంతరం హెచ్‌ఐవీపై రూపొందించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేయడంతో పాటు, క్యూఆర్ కోడ్ ద్వారా హెచ్‌ఐవీ స్థాయిని తెలుసుకునే సర్వేను స్థానికులతో చేయించారు. ఈ కార్యక్రమంలో బీమాబాయి మహిళా మండలి కమ్యూనిటీ ఆర్గనైజర్ ఎం నూకలక్ష్మి, సంస్థ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమాజంలో ఎయిడ్స్ పట్ల అవగాహన పెంచి, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. హెచ్ఐవి పట్ల గల అపోహలను తొలగించి,హెచ్ఐవి పరీక్షల పట్ల బాధ్యతను కల్పించే దిశగా ప్రచార కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో బాల బాలికలకు హెచ్ఐవి గురించి,ఏ విధంగా వ్యాపిస్తుంది,ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,హెచ్ఐవి పరీక్షలు స్వచ్ఛందంగా వెళ్లి ఎక్కడ చేయించుకోవాలి వంటి అనేక ప్రాముఖ్యమైన అంశాలను తెలియజేశారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి వెళ్లి హెచ్ఐవి మరియు ఎయిడ్స్ గురించి తెలియజేసి,సర్వే కార్యక్రమాన్ని చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.