Thursday, 18 June 2026
  • Home  
  • ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై విజయోత్సవ ర్యాలీ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనపై విజయోత్సవ ర్యాలీ

📌ముఖ్య అతిథిగా పాల్గొన్న తెదేపా తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి 📌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం 📌ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ న్యూస్ సూళ్లూరుపేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేటలో రెండేళ్ల పాలనపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ జిఎంటి రోడ్ కనకదుర్గ మహాల్ వరకు సాగింది.స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి ఒక్క పథకం అమలు చేశామని, రాష్ట్రంలో చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు అనేక ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పించాలని, అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన కాలంగా నది వంతెనను పూర్తిగా తొలగించి కొత్త వంతెనను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని, హోం మంత్రి పై వైసిపి నాయకులు చేసిన అనుచత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా పని చేయాలని తెలిపారు.తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనభాక లక్షి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పరుగులు పెడుతుందని, అమరావతి అభివృద్ధికి రైతుల అందిస్తున్న సహాయ సహకారాలకు అభినందనీయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టును అతి త్వరలో పూర్తిచేసి రాష్ట్రానికి అంకితం చేస్తామని తెలిపారు.పై కార్యక్రమంలో ఆరు మండలాల తెదేపా ఇన్చార్జిలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

📌ముఖ్య అతిథిగా పాల్గొన్న తెదేపా తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనబాక లక్ష్మి

📌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం

📌ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ

న్యూస్ సూళ్లూరుపేట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సూళ్లూరుపేట నియోజకవర్గం సూళ్లూరుపేటలో రెండేళ్ల పాలనపై విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ జిఎంటి రోడ్ కనకదుర్గ మహాల్ వరకు సాగింది.స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలలో ప్రతి ఒక్క పథకం అమలు చేశామని, రాష్ట్రంలో చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగులకు అనేక ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కల్పించాలని, అలాంటప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలిపారు. సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల క్రితం నిర్మించిన కాలంగా నది వంతెనను పూర్తిగా తొలగించి కొత్త వంతెనను నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని, హోం మంత్రి పై వైసిపి నాయకులు చేసిన అనుచత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతులకు, మహిళలకు, విద్యార్థులకు అన్ని విధాల ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కలిసికట్టుగా పని చేయాలని తెలిపారు.తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షురాలు పనభాక లక్షి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సారధ్యంలో అటు అభివృద్ధి ఇటు సంక్షేమం పరుగులు పెడుతుందని, అమరావతి అభివృద్ధికి రైతుల అందిస్తున్న సహాయ సహకారాలకు అభినందనీయం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టును అతి త్వరలో పూర్తిచేసి రాష్ట్రానికి అంకితం చేస్తామని తెలిపారు.పై కార్యక్రమంలో ఆరు మండలాల తెదేపా ఇన్చార్జిలు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.