Thursday, 3 September 2026
  • Home  
  • ఉప్పరపల్లిలో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు
- కడప

ఉప్పరపల్లిలో ఘనంగా పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు

ఏపీ డిప్యూటీ సీఎం,జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ జన్మదిన వేడుకలు సిద్ధవటం మండలంలోని ఉప్పరపల్లి సమీపంలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్‌ కళ్యాణ్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి,ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.పవన్‌ కళ్యాణ్‌ ప్రజాసేవ, సామాజిక బాధ్యత స్ఫూర్తితో పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కార్యక్రమంలో భాగంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ పవన్‌ కళ్యాణ్‌ ఆశయాలకు అనుగుణంగా జనసేన నాయకులు, కార్యకర్తలు ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారు. పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.పవన్‌ కళ్యాణ్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.