Friday, 26 June 2026
  • Home  
  • ఉదయగిరి రవాణా సౌకర్యం లక్ష్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎమ్మెల్యే కాకర్ల
- ఆంధ్రప్రదేశ్

ఉదయగిరి రవాణా సౌకర్యం లక్ష్యంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో ఎమ్మెల్యే కాకర్ల

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి చేపట్టడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురు వారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు జాతీయ రహదారులను చేరుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కనెక్టివిటీ రోడ్లు అభివృద్ధి చెందితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య కార్యకలాపాలు, విద్య, వైద్య సేవలకు చేరుకోవడం వేగవంతమవుతుందని వివరించాను. ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఈ రోడ్లు కీలకంగా నిలుస్తాయని తెలియజేశాను. కాకర్ల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ, ఉదయగిరి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ రహదారులకు అనుసంధానంగా మెరుగైన కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల సురేష్ సంతోషం వ్యక్తం చేశారు ప్రజల ప్రయాణం సులభం కావాలని… ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలనే లక్ష్యం తనదని ఈ సందర్భంగా సురేష్ తెలిపారు. –

ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న గ్రామాలు, మండల కేంద్రాలకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధి చేపట్టడం లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ని న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గురు వారం కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలోని అనేక గ్రామాల ప్రజలు జాతీయ రహదారులను చేరుకోవడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి, కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
కనెక్టివిటీ రోడ్లు అభివృద్ధి చెందితే ప్రజల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, వాణిజ్య కార్యకలాపాలు, విద్య, వైద్య సేవలకు చేరుకోవడం వేగవంతమవుతుందని వివరించాను. ఉదయగిరి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ఈ రోడ్లు కీలకంగా నిలుస్తాయని తెలియజేశాను.
కాకర్ల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ, ఉదయగిరి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో జాతీయ రహదారులకు అనుసంధానంగా మెరుగైన కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇవ్వడం పట్ల సురేష్ సంతోషం వ్యక్తం చేశారు
ప్రజల ప్రయాణం సులభం కావాలని… ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో నడవాలనే లక్ష్యం తనదని ఈ సందర్భంగా సురేష్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.