అధిక లోడ్లతో దూసుకెళ్తున్న లారీలు.. గాలికి ఎగిరే ఇసుకతో వాహనదారులకు నరకయాతన
ఆత్మకూరు, సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నుంచి వింజమూరు వెళ్లే సింగిల్ రోడ్డుపై అధిక లోడ్లతో ఇసుక లారీలు దూసుకెళ్తుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాల రాకపోకలతో సన్నని రహదారిపై ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక లారీల నుంచి రోడ్డుపై ఇసుక పడటంతో పాటు గాలికి ఎగిరి వెనుక ప్రయాణించే ద్విచక్ర వాహనదారుల కళ్లలోకి చేరుతోందని చెబుతున్నారు. దీంతో క్షణకాలం రహదారి కనిపించక వాహన నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ రోడ్డుపై ఎదురెదురుగా భారీ వాహనాలు వచ్చినప్పుడు చిన్న వాహనదారులు పక్కకు తప్పుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు.
అధిక లోడ్లతో ఇసుక రవాణా చేస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లారీలను తనిఖీ చేయాలని, సామర్థ్యానికి మించి ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇసుక రోడ్డుపై పడకుండా లారీలను పూర్తిగా కప్పి తరలించేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇసుక లారీల ఇష్టారాజ్యం.. సింగిల్ రోడ్డుపై మృత్యు ముప్పు!
అధిక లోడ్లతో దూసుకెళ్తున్న లారీలు.. గాలికి ఎగిరే ఇసుకతో వాహనదారులకు నరకయాతన ఆత్మకూరు, సెప్టెంబర్ 11 (పున్నమి ప్రతినిధి): ఆత్మకూరు నుంచి వింజమూరు వెళ్లే సింగిల్ రోడ్డుపై అధిక లోడ్లతో ఇసుక లారీలు దూసుకెళ్తుండటంతో వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్న భారీ వాహనాల రాకపోకలతో సన్నని రహదారిపై ప్రమాదకర పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇసుక లారీల నుంచి రోడ్డుపై ఇసుక పడటంతో పాటు గాలికి ఎగిరి వెనుక ప్రయాణించే ద్విచక్ర వాహనదారుల కళ్లలోకి చేరుతోందని చెబుతున్నారు. దీంతో క్షణకాలం రహదారి కనిపించక వాహన నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింగిల్ రోడ్డుపై ఎదురెదురుగా భారీ వాహనాలు వచ్చినప్పుడు చిన్న వాహనదారులు పక్కకు తప్పుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటున్నారు. అధిక లోడ్లతో ఇసుక రవాణా చేస్తున్న లారీలపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లారీలను తనిఖీ చేయాలని, సామర్థ్యానికి మించి ఇసుకను తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇసుక రోడ్డుపై పడకుండా లారీలను పూర్తిగా కప్పి తరలించేలా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రహదారి భద్రతకు ప్రాధాన్యతనిస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు, స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

