లోకేశ్వరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ష ప్రసాద్ ఆధ్వర్యంలో సన్మానం.నీట్ (NEET) పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించి, ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు సాధించిన అర్ష నవ్యశ్రీని లోకేశ్వరం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ష ప్రసాద్ తన సహోదరులతో కలిసి ఘనంగా సన్మానించారు. భాగాపూర్ గ్రామానికి చెందిన అర్ష ఇందిరా–సాయన్న దంపతుల కుమార్తె నవ్యశ్రీ, సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ఎంతో ప్రతిష్టాత్మకమైన నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రభుత్వ వైద్య కళాశాలలో MBBS సీటు సాధించడం గ్రామానికి, మండలానికి గర్వకారణమని ఈ సందర్భంగా అర్ష ప్రసాద్ కొనియాడారు. పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు కష్టపడి చదివితే ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని నవ్యశ్రీ నిరూపించిందని అన్నారు. ఆమె పట్టుదల, కృషి, ఆత్మవిశ్వాసం నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో నవ్యశ్రీ వైద్య రంగంలో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి, ప్రజలకు సేవ చేసే మంచి వైద్యురాలిగా పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. ఆమె సాధించిన విజయం భాగాపూర్ గ్రామంతో పాటు లోకేశ్వరం మండలంలోని విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని తెలిపారు.నవ్యశ్రీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఆమె ఉజ్వల భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

నీట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు సాధించిన నవ్యశ్రీకి ఘన సన్మానం