ఆగస్టు 22 పున్నమి ప్రతినిధి
కుబీర్ మండలంలోని బెల్గాం తండా గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది మాజీ శాసనసభ్యులు గారు మాట్లాడుతూ మన తెలంగాణ రాష్ట్ర ప్రజ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణo పనులను చేపడుతుందని పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే మన ప్రజా ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యం అని అన్నారు. రెండవ దశ కూడా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుందని త్వరలోనే రెండవ దశ ఇందిరమ్మ ఇండ్లు కూడా మంజూరు అవుతాయని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినందుకు *మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారికి మరియు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి గౌరవనీయులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ముధోల్ నియోజకవర్గం ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాజీ శాసనసభ్యులు గారి వెంట AMC చైర్మన్ గోనెలు కళ్యాణ్, మాజీ జడ్పిటిసి శంకర్ చౌవన్,సర్పంచులు గోకుల్ రాజు, మారుతీ,మాజీ పిఎస్ చైర్మన్ రాములు, సర్పంచ్ విజయ్,ఆనంద్ బాల ఆనంద్, బక్కన్న, మంగళి సాయి, నాయక్ సీతారాం, బాపూరావు నాయక్, జాదవ్ మోతిలాల్, లాలూ కరోబరి,ఎర్రన్న,గణపతి,భూరాజి మరియు తదితరులు ఉన్నారు.



