Saturday, 25 April 2026
  • Home  
  • ఇంటర్‌లో మౌనిక ప్రతిభ – 500లో 483 మార్కులు సాధించి గ్రామానికి గౌరవం
- తిరుపతి

ఇంటర్‌లో మౌనిక ప్రతిభ – 500లో 483 మార్కులు సాధించి గ్రామానికి గౌరవం

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 25 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలంలోని గుండేలగుంట గ్రామానికి చెందిన వన్నెకాపు చెంచురెడ్డి, నాగమ్మ దంపతుల కుమార్తె వి. మౌనిక శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో జూనియర్ ఇంటర్ సీఈసీ గ్రూప్‌లో ప్రతిభ కనబరుస్తూ 500 మార్కులకు గాను 483 మార్కులు సాధించింది. చిన్ననాటి నుంచి ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువుకుంటూ క్రమశిక్షణతో విద్యను అభ్యసించిన మౌనిక ఈ ఫలితంతో తన ప్రతిభను మరోసారి చాటుకుంది. ఆమె సాధించిన విజయంపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళినాయుడు మౌనికను దుశ్యాలువతో సత్కరించి అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఇంత మంచి ఫలితాలు సాధించడం గర్వకారణమని కొనియాడారు. భవిష్యత్తులో ఉన్నత విద్యను ఎంపిక చేసుకొని మరింత మెరుగైన ఫలితాలు సాధించి మంచి స్థాయికి ఎదగాలని సూచించారు. తల్లిదండ్రులకు, గ్రామానికి, మండలానికి మౌనిక మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.