Wednesday, 6 May 2026
  • Home  
  • ఆశయ సాధనే నాన్నకు ఇచ్చే నిజమైన నివాళి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

ఆశయ సాధనే నాన్నకు ఇచ్చే నిజమైన నివాళి-ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 06 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజికవర్గ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తన తండ్రికి వినమ్ర నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాళహస్తి క్షేత్ర అభివృద్ధికి గోపాలకృష్ణా రెడ్డి వేసిన పునాదులే నేటి ప్రగతికి నాంది అని కొనియాడారు. ప్రజా సేవలో నాన్నే దిక్సూచి: “నాన్న నేర్పిన విలువలు, ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావమే నా ప్రయాణానికి దిక్సూచి. ఆయన ఆశయాలను గుండెల్లో నింపుకుని, నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను” అని సుధీర్ రెడ్డి పేర్కొన్నారు. గోపాలకృష్ణా రెడ్డి భౌతికంగా దూరమైనా, ఆయన చేసిన అభివృద్ధి పనులు, జ్ఞాపకాల రూపంలో ఎల్లప్పుడూ ప్రజల గుండెల్లో జీవించే ఉంటారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్మరించుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.