Sunday, 31 May 2026
  • Home  
  • ఆరుట్ల గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం
- E-పేపర్

ఆరుట్ల గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం

ఆరుట్ల గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం ప్లాస్టిక్‌కు నో చెప్పాలి – యువత మద్యపానం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : BRR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి పున్నమి న్యూస్ 31మే 2026 తెలంగాణ ఇంచార్జి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Say No To Plastic Bags & Covers” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRR ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బూడిద రామ్ రెడ్డి గారు హాజరై గ్రామ ప్రజలకు బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ సర్పంచ్ మానిపాటి శోభ – కుమార్ గారు, ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ గారు పాల్గొని వారి చేతుల మీదుగా గ్రామ ప్రజలకు పర్యావరణ హిత బ్యాగులను అందజేశారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై BRR ఫౌండేషన్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా BRR ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బూడిద రామ్ రెడ్డి అన్న గారు మాట్లాడుతూ గ్రామాల్లోని యువత మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువకులు మంచి విద్యను అభ్యసించి సమాజంలో మంచి పేరు సంపాదించాలని, గ్రామ అభివృద్ధికి తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా BRR ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. ఆరుట్ల గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ఫౌండేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకురాగానే వెంటనే గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. గ్రామ మహిళా సంఘాల సభ్యులు కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేయగా, వెంటనే BRR ఫౌండేషన్ తరఫున మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా BRR ఫౌండేషన్ దృష్టికి తీసుకువస్తే ముందుండి పరిష్కరిస్తామని బూడిద రామ్ రెడ్డి గారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు మొర్రి పద్మ – ఐలయ్య గారు, BRR ఫౌండేషన్ సభ్యులు, వార్డు సభ్యుడు పున్నం రాము గారు, మాజీ వార్డు సభ్యులు ఎం.డి. సద్దాం హుస్సేన్ గారు, అశ్వల బాలరాజు, కొత్తపల్లి సాయి గౌడ్, సుంకరి బాను గౌడ్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఆరుట్ల గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ కార్యక్రమం

ప్లాస్టిక్‌కు నో చెప్పాలి – యువత మద్యపానం, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి : BRR ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్ రెడ్డి

పున్నమి న్యూస్
31మే 2026
తెలంగాణ ఇంచార్జి

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో BRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో “Say No To Plastic Bags & Covers” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRR ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బూడిద రామ్ రెడ్డి గారు హాజరై గ్రామ ప్రజలకు బ్యాగులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆరుట్ల గ్రామ సర్పంచ్ మానిపాటి శోభ – కుమార్ గారు, ఉప సర్పంచ్ నూకం రాజు ముదిరాజ్ గారు పాల్గొని వారి చేతుల మీదుగా గ్రామ ప్రజలకు పర్యావరణ హిత బ్యాగులను అందజేశారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై BRR ఫౌండేషన్ సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా BRR ఫౌండేషన్ చైర్మన్ శ్రీ బూడిద రామ్ రెడ్డి అన్న గారు మాట్లాడుతూ గ్రామాల్లోని యువత మద్యపానం, డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. యువకులు మంచి విద్యను అభ్యసించి సమాజంలో మంచి పేరు సంపాదించాలని, గ్రామ అభివృద్ధికి తమ వంతు బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
అలాగే ప్రజలు ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా BRR ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.
ఆరుట్ల గ్రామంలో తాగునీటి సమస్య ఉందని ఫౌండేషన్ సభ్యులు తన దృష్టికి తీసుకురాగానే వెంటనే గ్రామంలో వాటర్ ఫిల్టర్ ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. గ్రామ మహిళా సంఘాల సభ్యులు కార్యాలయాల వద్ద మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలియజేయగా, వెంటనే BRR ఫౌండేషన్ తరఫున మరుగుదొడ్ల నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు.
గ్రామంలో ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నా BRR ఫౌండేషన్ దృష్టికి తీసుకువస్తే ముందుండి పరిష్కరిస్తామని బూడిద రామ్ రెడ్డి గారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వార్డు సభ్యురాలు మొర్రి పద్మ – ఐలయ్య గారు, BRR ఫౌండేషన్ సభ్యులు, వార్డు సభ్యుడు పున్నం రాము గారు, మాజీ వార్డు సభ్యులు ఎం.డి. సద్దాం హుస్సేన్ గారు, అశ్వల బాలరాజు, కొత్తపల్లి సాయి గౌడ్, సుంకరి బాను గౌడ్, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.