Wednesday, 1 July 2026
  • Home  
  • ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్ధార్ : చంద్రబాబు హెచ్చరిక
- E-పేపర్

ఆడబిడ్డల జోలికొస్తే ఖబడ్ధార్ : చంద్రబాబు హెచ్చరిక

పున్నమి ప్రతినిధి : నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలోపాల్గొన్న చంద్రబాబు ఆడబిడ్డల జోలికి రావద్దని పరోక్షంగా వైసిపీని హెచ్చరించారు . సభ సాంతం వైసిపీ పై విమర్శనభాణాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము ఎలా పాటు పడుతున్నామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు . పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శం అని ఉద్ఘాటించారు . పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొంటూ ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాక్షించారు . . అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుంది. దేశంలోనే మెగా ఫర్నిచర్‌ పార్క్‌ గూడూరులో వస్తోంది. 10 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు’’ అని చంద్రబాబు అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచామని, 62.20 లక్షల మంది కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తాను ఇంట్లో కూర్చుని బటన్‌ నొక్కేవాణ్ని కాదని, ప్రజల్లో ఉండే వ్యక్తినన్నారు. 28 కేటగిరీల వారికి పండుగ వాతావరణంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని స్పష్టం చేశారు. సభలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంఅభివృద్ధికి సియం చంద్రబాబు కారణం అన్నారు.పున్నపువారిపాలెంకు రోడ్డులేని పరిస్థుతుల్లోఎన్ ఆర్ జి సి ద్వారా 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి డబుల్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా అటవీ శాఖ అనుమతులు ఇప్పించి రోడ్డు నిర్మాణం చేపట్టిన అభివృద్ధి ప్రధాత సియం చంద్రబాబు అన్నారు.ఈ రోడ్డు నిర్మాణం తో ఈ ప్రాంతం లో భూములు రేట్లు మూడు రేట్లు పెరిగాయి అని తెలిపారు. పున పరి వారి పాళెం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. తిరుపతి జిల్లా లో గూడూరు నియోజకవర్గం ను నెల్లూరు జిల్లా లో కలిపి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా చంద్రన్న అన్నారు. ఈ సందర్బంగా ఆయన మరో సారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు. గూడూరు ఫ్లయిఓవర్ బ్రిడ్జి కి నిధులు మంజూరు చేయాలనీ, చిట్టమూరు మండలంలో త్రాగునీరు సమస్యను తీర్చాలని, పున్నపువారిపాలెంబ్రిడ్జి, బాలిరెడ్డి పాళెంలో స్వర్ణ ముఖి నది పై బ్రిడ్జ్, కోట లో ఇంటి స్థలాలు ఇలా పలు సమస్యలు పై సియం నివేదిక అందిస్తాను అనీ తెలిపారు.సభను విజయవంతం చేసిన టీడీపీ బృందానికి, అధికారులకు సునీల్ కృతజ్ఞతలు తెలిపారు.

పున్నమి ప్రతినిధి : నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెం ప్రజావేదిక సభలోపాల్గొన్న చంద్రబాబు ఆడబిడ్డల జోలికి రావద్దని పరోక్షంగా వైసిపీని హెచ్చరించారు . సభ సాంతం వైసిపీ పై విమర్శనభాణాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తాము ఎలా పాటు పడుతున్నామో ప్రజలకు వివరించే ప్రయత్నం చేసారు .
పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శం అని ఉద్ఘాటించారు . పేదవారందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తాం. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని పేర్కొంటూ ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని ఆకాక్షించారు . . అందరికీ సంక్షేమ ఫలాలు అందాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలి. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుంది. దేశంలోనే మెగా ఫర్నిచర్‌ పార్క్‌ గూడూరులో వస్తోంది. 10 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాం. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయి. ఒకప్పుడు పెట్టుబడిదారులు పారిపోయారు. ఇప్పుడు రాష్ట్రాన్ని వెతుక్కుంటూ వస్తున్నారు. నమ్మకం కలిగించినందుకే రాష్ట్రానికి క్యూ కడుతున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు పెంచామని, 62.20 లక్షల మంది కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. తాను ఇంట్లో కూర్చుని బటన్‌ నొక్కేవాణ్ని కాదని, ప్రజల్లో ఉండే వ్యక్తినన్నారు. 28 కేటగిరీల వారికి పండుగ వాతావరణంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్లు అందిస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నామని స్పష్టం చేశారు. సభలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గంఅభివృద్ధికి సియం చంద్రబాబు కారణం అన్నారు.పున్నపువారిపాలెంకు రోడ్డులేని పరిస్థుతుల్లోఎన్ ఆర్ జి సి ద్వారా 4 కోట్ల రూపాయలు మంజూరు చేసి డబుల్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగిందన్నారు. అంతే కాకుండా అటవీ శాఖ అనుమతులు ఇప్పించి రోడ్డు నిర్మాణం చేపట్టిన అభివృద్ధి ప్రధాత సియం చంద్రబాబు అన్నారు.ఈ రోడ్డు నిర్మాణం తో ఈ ప్రాంతం లో భూములు రేట్లు మూడు రేట్లు పెరిగాయి అని తెలిపారు. పున పరి వారి పాళెం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

తిరుపతి జిల్లా లో గూడూరు నియోజకవర్గం ను నెల్లూరు జిల్లా లో కలిపి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా చంద్రన్న అన్నారు. ఈ సందర్బంగా ఆయన మరో సారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అన్నారు. గూడూరు ఫ్లయిఓవర్ బ్రిడ్జి కి నిధులు మంజూరు చేయాలనీ, చిట్టమూరు మండలంలో త్రాగునీరు సమస్యను తీర్చాలని, పున్నపువారిపాలెంబ్రిడ్జి, బాలిరెడ్డి పాళెంలో స్వర్ణ ముఖి నది పై బ్రిడ్జ్, కోట లో ఇంటి స్థలాలు ఇలా పలు సమస్యలు పై సియం నివేదిక అందిస్తాను అనీ తెలిపారు.సభను విజయవంతం చేసిన టీడీపీ బృందానికి, అధికారులకు సునీల్ కృతజ్ఞతలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.