ఆక్వా రంగాన్ని నమ్ముకున్న రైతులను నష్టాల ఊబిలోకి నెడుతున్న స్థిరీకరణ లేని ధరల పెంపుదలపై ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు అన్నారు. సెప్టెంబర్ నెలాఖరులోగా మేతల తయారీదారులనుంచి సానుకూల నిర్ణయం వెలువడితే సరి, లేకుంటే ఆ కంపెనీలకు చెందిన మేతల కొనుగోళ్లు నిలిపివేయాలని, వచ్చే ఏడాది నాటికి పంటకాలం పూర్తిచేసుకుని ఆతరువాత పంట వేయకుండా పంట విరామం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్వారంగంలో ఎదుర్కొంటోన్న సమస్యలపై డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో నిర్వహించిన ఛలో అమలాపురం కార్యక్రమంలో భాగంగా ఆక్వారైతు బ్రతుకు పోరాట సభ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన నాయకులతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమానికి నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉన్న ఆక్వా రైతు సంఘ నాయకులు, రైతులు భారీ స్థాయిలో తరలివచ్చారు. అంతకుముందు అమలాపురం వై.జంక్షన్ నుంచి సభావేదిక వరకు భారీగా ఆక్వా రైతులంతా ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వెళ్లారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆక్వారైతు సంఘ అధ్యక్షుడు దెందుకూరి సత్తిబాబు రాజు అధ్యక్షతన నిర్వహించిన ఈ సభలో రాష్ట్రంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ ఆక్వా రంగంలో సీడ్ దశనుంచి పంట చేతికి వచ్చి రొయ్యల ఎగుమతి వరకు ఆక్వా రైతులు దగా పడుతున్నారన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నా కానీ రైతుల నుండి తక్కువకు కొనుగోలు చేయడం జరుగుతోందని, రైతులకు న్యాయం జరిగేలా కనీస మద్దతు ధర కల్పించాలన్నారు. అప్సడా చట్టం ఉన్నా అది రైతులకు వర్తించని దుస్తితి ఉందన్నారు. ప్రభుత్వం చొరవ చూపించి ఆక్వారంగంలో తిష్టవేసిన సిండికేట్, దళారీ వ్యవస్థలను రూపుమాపాలని కోరారు. సమస్యలు పరిష్కారం చూపకుంటే వచ్చే ఏడాది మార్చి తరువాత పంటలు వేయకుండా రైతులంతా పంట విరామం ప్రకటించాలని సూచించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి పంటవిరామమే శరణ్యం అన్నారు. ఆక్వా రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి త్సవటపల్లి నాగభూషణం మాట్లాడుతూ ఆక్వా రైతు వరుస నష్టాలతో చావు బ్రతుకుల మధ్య పోరాడుతున్నాడన్నారు. దేశ రక్షణలో జవాన్ మరణానికి ఎదురొడ్డి ఎలా తప్పక పోరాటం చేస్తాడో ఆక్వా సాగులో కూడా రైతు అదే స్థితిలో నష్టాల ఊబిలో కూడా సాగును కొనసాగిస్తున్నాడన్నారు. ఆక్వాలో సిండికేట్ వ్యవస్థ లేకుండా చేసి భారంగా మారుతోన్న ఆక్వామేతల ధరలను స్థిరంగా ఉండేలా చేయాలని డిమాండ్ చేశారు. ఆక్వారంగంలో రైతులు ఎదుర్కొంటోన్న సమస్యలపై పలు తీర్మానాలు చేసి ఆమోదించారు. ఫీడ్ ధరలు తగ్గించుకుంటే 30 వ తేదీ తరువాత ఆ ఫీడ్ కంపెనీలును బ్యాన్ చేస్తామని, 57 జీవోలో ఉన్న పవర్ ఫ్యాక్టర్ నిభందన తొలగించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 12500 విద్యుత్తు కనెక్షన్లును వెంటనే విద్యుత్తు సబ్సిడీ అమలు చేసి లోపాలను సరిదిద్దుకోవడానికి సమయం ఇవ్వాలని, ధరల విషయంలోఉన్న అస్థిరతను సరిచేసి గతంలో ఉన్న వేరియేషన్ను కొనసాగించాలి, అలాగే ప్రతీ పది రోజులకు మార్కెట్ రేటు నిలకడగా అమలు చేయాలని ఇంకా తదితర తీర్మానాలు చేసి అల్టిమేట్ జారీచేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈదరి యశ్వంత్ కుమార్, సంయుక్త కార్యదర్శి ముదునూరి శ్రీహరి వర్మ, దాట్ల పృద్వీరాజు, అల్లూరి రమేష్ రాజు, యాళ్ల వెంకటానందం, కాకర్ల వినాయకం, మేడిది జాన్ డేవిడ్ రాజు, చిలికాని సూర్యారావు, కొటికలపూడి కృష్ణశ్రీ, బోస్ రాజు, కొప్పుల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.

ఆక్వారంగ సమస్యలు పరిష్కరించకుంటే పంటవిరామం ప్రకటిస్తాం