చిట్వేల్, అక్టోబర్ 2 (పున్నమి ప్రతినిధి ప్రతినిధి)
చిట్వేల్ పట్టణంలోని భువనేశ్వరి శ్యామలాంబ సమేత శ్రీ శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో బుధవారం ప్రత్యేక కార్యక్రమంగా దుస్తుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి హాజరయ్యారు. ఆలయ ఆవరణలో పెంచలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూపానంద రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన స్వయంగా పలు కుటుంబాలకు దుస్తులు అందజేశారు.ఈ సందర్భంగా మాట్లాడిన ముక్కా రూపానంద రెడ్డి “ఇలాంటి కార్యక్రమాలు అవసరంలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తాయి. సమాజంలో బలహీన వర్గాలకు తోడ్పాటు అందించే దిశగా దుస్తుల పంపిణీ ఎంతో ఉపయోగకరం. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన పెంచలయ్యకు హృదయపూర్వక అభినందనలు అని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎన్డీయే కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.


