వేముల, సెప్టెంబర్ 08 (పున్నమి న్యూస్): ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని వేముల ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో వేముల గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల భద్రత, మహిళలపై జరిగే నేరాల నివారణ, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళలు తమకు ఎదురయ్యే సమస్యలను నిర్భయంగా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎన్నికల నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి గొడవలు, వివాదాలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.
అలాగే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింక్‌లకు స్పందించవద్దని సూచించారు. వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.


