ఆర్యా.
రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్ప మరొకటి కాదు. ఓ వైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు, భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వైద్యులు ఈ కరోనా వైరస్ బారి నుండి పిల్లలను, వృద్ధులను కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిరంతరం ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బయట తిరగకుండా చూడడం, ఇంట్లోనే ఉంటున్నా శానిటైజర్ లతో మోచేతుల దాకా చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం, తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చిన వారికి తల స్నానం చేయించడం లాంటి చర్యలు తీసుకోవాలి.పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలి. ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నా ప్రభుత్వం బ్రిడ్జి కోర్సులు, అవగాహన తరగతుల నిర్వహణ పేరుతో ఉపాధ్యాయులను పిల్లలను పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించింది. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఓవైపున రోజు రోజుకు కరోనా విజృంభిస్తూ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతూ మరణ మృదంగాలు మోగిస్తుంది. తుఫాన్ వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా పంజా విసిరితూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతుంది. అందుకే ప్రమాదకరమైన ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న దేశంలోని అనేక రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలే కాకుండా ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంకా అనేక ఎంట్రన్స్ పరీక్షలను కూడా రద్దు చేశాయి.
ఈ విద్యా సంవత్సరంలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు, ఉపాధ్యాయుల మరియు పిల్లల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ, తమిళనాడు, ఒడిసా,చత్తీస్ గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక కోరుతున్నది. పిల్లలు సాధించిన అంతర్గత మార్కులు, హాజరు ప్రాతిపదికగా ప్రభుత్వమే పదవ తరగతి ఫలితాలు ప్రకటించాలి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, పిల్లలను సంరక్షించుకునేందుకు రాష్ట్రంలో బ్రిడ్జి కోర్సులు, ఇతర అన్ని రకాల పరీక్షలను కూడా రద్దు చేసి ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని ప్రజారోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కోరుతుందికుప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ కోరుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన వినతి పత్రం.
ఆర్యా. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి జోరందుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడటం తప్ప మరొకటి కాదు. ఓ వైపున ప్రపంచ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు, భారత వైద్య పరిశోధన మండలి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ వైద్యులు ఈ కరోనా వైరస్ బారి నుండి పిల్లలను, వృద్ధులను కాపాడుకోవడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. నిరంతరం ఆరోగ్య పరిరక్షణలో భాగంగా బయట తిరగకుండా చూడడం, ఇంట్లోనే ఉంటున్నా శానిటైజర్ లతో మోచేతుల దాకా చేతులు శుభ్రం చేసుకునేలా చూడడం, తప్పని సరి పరిస్థితుల్లో బయటకు వెళ్లి వచ్చిన వారికి తల స్నానం చేయించడం లాంటి చర్యలు తీసుకోవాలి.పౌష్టికాహారం అందించడం ద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించాలి. ఇలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలని పదే పదే చెప్తున్నా ప్రభుత్వం బ్రిడ్జి కోర్సులు, అవగాహన తరగతుల నిర్వహణ పేరుతో ఉపాధ్యాయులను పిల్లలను పాఠశాలకు హాజరు కావాలని ఆదేశించింది. వారి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఏ మాత్రం సమర్ధనీయం కాదు. ఓవైపున రోజు రోజుకు కరోనా విజృంభిస్తూ రెట్టింపు సంఖ్యలో కేసులు నమోదవుతూ మరణ మృదంగాలు మోగిస్తుంది. తుఫాన్ వేగంతో వ్యాప్తి చెందుతూ ప్రపంచవ్యాప్తంగా పంజా విసిరితూ మానవాళి మనుగడకే సవాల్ విసురుతుంది. అందుకే ప్రమాదకరమైన ఈ పరిస్థితులను అర్థం చేసుకున్న దేశంలోని అనేక రాష్ట్రాలు పదోతరగతి పరీక్షలే కాకుండా ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంకా అనేక ఎంట్రన్స్ పరీక్షలను కూడా రద్దు చేశాయి. ఈ విద్యా సంవత్సరంలో కరోనా ఉధృతిని దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత వైద్య పరిశోధన మండలి మార్గదర్శకాలు, ఉపాధ్యాయుల మరియు పిల్లల తల్లిదండ్రుల ఆందోళనలను పరిగణలోకి తీసుకుని తెలంగాణ, తమిళనాడు, ఒడిసా,చత్తీస్ గఢ్ రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలని ప్రజారోగ్య వేదిక కోరుతున్నది. పిల్లలు సాధించిన అంతర్గత మార్కులు, హాజరు ప్రాతిపదికగా ప్రభుత్వమే పదవ తరగతి ఫలితాలు ప్రకటించాలి. అలాగే కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు, పిల్లలను సంరక్షించుకునేందుకు రాష్ట్రంలో బ్రిడ్జి కోర్సులు, ఇతర అన్ని రకాల పరీక్షలను కూడా రద్దు చేసి ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరించాలని ప్రజారోగ్య వేదిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ కోరుతుందికుప్రజారోగ్య వేదిక రాష్ట్ర కమిటీ కోరుతుంది.