శ్రీను అమ్మ మాట వినేవాడు కాదు.అమ్మ నిత్యం అదే పనిగా క్రమశిక్షణ గురుంచి చెబుతుంది.స్కూల్లో ఎవరితో స్నేహం చేస్తున్నావు.స్కూల్ బయిట ఎవరితో కాలక్షేపం చేస్తున్నావు.ఆ అబ్బాయితో తిరగవద్దు.ఈ అబ్బాయితో తిరగవద్దు.పలానా పిల్లలతో స్నేహం చెయ్యు పర్వాలేదు,ఆ అబ్బాయి ప్రవర్తన మంచిది…ఈ అబ్బాయి ప్రవర్తన మంచిది కాదు అంటుంది.అన్నీ నిబంధనలే పెడుతుంది.మొదట్లో అమ్మ మాట వినేవాడిని ఇప్పుడు వినడం మానేసాను అని నిర్లక్ష్యంగా అంటుండేవాడు.
ఒక రోజు శ్రీను అమ్మ వద్దన్నా వినకుండా ఫ్రెండ్ సుకుమార్ తో కలిసి బైక్ మీద పట్టణం వెళ్ళాడు శ్రీను.పరిమితికి మించిన వేగంతో బైక్ నడిపి సుకుమార్ ఆక్సిడెంట్ చేసాడు.ఆ ఆక్సిడెంట్ లో ఒక ముసలాయనకు గాయాలు అయ్యాయి .సుకుమార్ కి శ్రీను కి కూడా గాయాలు అయ్యాయి.
పోలీస్ లు సుకుమార్ ని శ్రీనుని అదుపులోకి తీసుకొని ఒక రోజంతా ఇద్దరినీ పోలీస్ స్టేషన్లో ఉంచారు.పేరెంట్స్ కి కబురుపెట్టి మైనర్ పిల్లలకు బైక్ ఇచ్చినందుకు గట్టిగా మందలించి, ముసలాయన గాయాలు నాయమవ్వడానికి అవసరమైన డబ్బులు పేరెంట్స్ దగ్గర వసూల్ చేసి శ్రీనుని సుకుమార్ ని విడిచిపెట్టారు.
అప్పుడు అర్ధమైంది శ్రీనుకి అమ్మ కొంతమంది అబ్బాయిలతో స్నేహం ఎందుకు చెయ్యవద్దు అని అంటుందో.అప్పటి నుంచి అమ్మ మాట వింటూ శ్రీను బుద్దిగా ఉండేవాడు.
ఎం వి స్వామి


