Tuesday, 5 May 2026
  • Home  
  • అమండురులో ‘కిశోర వికాసం’ కార్యక్రమం-బాలికలకు అవగాహన
- తిరుపతి

అమండురులో ‘కిశోర వికాసం’ కార్యక్రమం-బాలికలకు అవగాహన

ఎర్పేడు, మే 05 (పున్నమి న్యూస్): ఎర్పేడు మండల పరిధిలోని అమండురు అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం ‘కిశోర వికాసం’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఐసీడీఎస్ రేణిగుంట ప్రాజెక్ట్ సీడీపీఓ కృష్ణవేణి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో కిశోర బాలికలకు విద్య ప్రాముఖ్యత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణ, జీవన నైపుణ్యాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు. మే 1 నుండి జూన్ 12 వరకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఈ ప్రత్యేక సదస్సులు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సమయాల్లో టోల్ ఫ్రీ నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే పోక్సో చట్టం, ‘గుడ్ టచ్ – బ్యాడ్ టచ్’ వంటి కీలక అంశాలపై వివరణ ఇచ్చి బాలికలు ధైర్యంగా ముందుకు సాగాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ కె. రత్నమ్మ, మహిళా పోలీస్ రేణుక, అంగన్‌వాడీ కార్యకర్తలు సుమతి, ఎ. సునీత తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.