Tuesday, 12 May 2026
  • Home  
  • అన్నదేవరపేటలో శ్రీ సీతారామ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన
- తూర్పు గోదావరి

అన్నదేవరపేటలో శ్రీ సీతారామ రామస్వామి ఆలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన

తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి, మే 12 : తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని శ్రీ సీతారామ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు పుష్కర గ్రాంట్ కింద మంజూరైన రూ.80 లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పనను పరిశీలించిన ఎమ్మెల్యే, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల నేపథ్యంలో ఆలయాలు, ఘాట్లు మరియు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అన్నదేవరపేటలోని ఈ ఆలయం ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం కలిగినదని, పునర్నిర్మాణం పూర్తయిన తరువాత ఆలయానికి మరింత వైభవం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాభివృద్ధి, దేవాలయాభివృద్ధి రెండూ సమన్వయంతో కొనసాగాలని, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి ద్వారా గ్రామాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అల్లూరి విక్రమాదిత్య, కొటారు వెంకట్రావు, నామన పరమేష్, ముళ్ళపూడి రామచంద్రం, ముళ్ళపూడి లక్ష్మణ రావు, కూచిపూడి గణపతి, తాసిల్దార్ లక్ష్మీ లావణ్య, ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

తాళ్లపూడి,పున్నమి ప్రతినిధి, మే 12 : తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని శ్రీ సీతారామ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు పుష్కర గ్రాంట్ కింద మంజూరైన రూ.80 లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పునర్నిర్మాణ పనులను ప్రారంభించారు.
అనంతరం ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పనను పరిశీలించిన ఎమ్మెల్యే, నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల నేపథ్యంలో ఆలయాలు, ఘాట్లు మరియు భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు.
అన్నదేవరపేటలోని ఈ ఆలయం ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం కలిగినదని, పునర్నిర్మాణం పూర్తయిన తరువాత ఆలయానికి మరింత వైభవం చేకూరుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. భవిష్యత్తులో పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాభివృద్ధి, దేవాలయాభివృద్ధి రెండూ సమన్వయంతో కొనసాగాలని, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి ద్వారా గ్రామాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో అల్లూరి విక్రమాదిత్య, కొటారు వెంకట్రావు, నామన పరమేష్, ముళ్ళపూడి రామచంద్రం, ముళ్ళపూడి లక్ష్మణ రావు, కూచిపూడి గణపతి, తాసిల్దార్ లక్ష్మీ లావణ్య, ఈవో వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.