పోలవరం ఎడమ కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు జలహారతి – పాయకరావుపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు
పున్నమి న్యూస్ రిపోర్టర్ ఆనంద్ :
అనకాపల్లి: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తీసుకువచ్చే మహత్తర కార్యక్రమానికి అడుగు పడింది. పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ క్రాస్ రెగ్యులేటర్ నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలకు గోదావరి జలాలను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలు అందుతున్నాయన్న సూచికగా పాయకరావుపేట వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లా పరిధి వరకు చేరుకున్న గోదావరి జలాలకు ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు.గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమం వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి లభ్యత పెంచడంతో పాటు ప్రాంత అభివృద్ధికి దోహదపడుతుందని నాయకులు పేర్కొన్నారు. ఎన్నో ఏళ్లుగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న గోదావరి జలాల కల సాకారమయ్యే దిశగా ఈ కార్యక్రమం కీలక మైలురాయిగా నిలిచిందన్నారు.
కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయ కృష్ణన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా, ఐపీఎస్, జిల్లా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. పాయకరావుపేట ఎమ్మెల్యే, రాష్ట్ర హోంశాఖ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత, రాష్ట్ర గనులు–భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర తదితర ప్రముఖులు కార


