Tuesday, 23 June 2026
  • Home  
  • అధికారంలో ఉన్నప్పుడు లేదు గానీ.. ఇప్పుడు ఆత్మీయ సమావేశాలా?
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అధికారంలో ఉన్నప్పుడు లేదు గానీ.. ఇప్పుడు ఆత్మీయ సమావేశాలా?

వైసీపీ ఆత్మీయ సమావేశాలు రాజకీయ అవకాశవాదమేనని జనసేన నేత కిషోర్ విమర్శ. Nellore: వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గంపై అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టమైన వైఖరి చూపకపోవడమే కాకుండా, కాపు కార్పొరేషన్‌కు భారీ నిధులు కేటాయిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. కాపు యువత విద్య, విదేశీ విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయిన సమయంలో ఇప్పుడు ఆత్మీయ సమావేశాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.నేరం చేసిన వ్యక్తిని చట్టం ప్రకారం శిక్షించాల్సిందే తప్ప, ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కులానికి అంటగట్టడం సమంజసం కాదన్నారు. నేరస్థుడికి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వం ప్రతి అంశాన్ని కుల కోణంలో చూడటానికి ప్రయత్నిస్తోందని, అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పదవులు, వైస్ ఛాన్సలర్ పోస్టులు, కాంట్రాక్టులు వంటి అవకాశాలను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అప్పట్లో సామాజిక న్యాయం గురించి మాట్లాడని వారు ఇప్పుడు కులాల పేరుతో సమావేశాలు నిర్వహించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.నేటి యువత కులాలు, మతాలు దాటి సమానత్వం, అభివృద్ధి, అవకాశాల కోసం ఆలోచిస్తోందని, కానీ కొందరు రాజకీయ నాయకులు ఇంకా కుల విభజనల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రాజకీయాలు సమాజాన్ని వెనక్కి నెడతాయని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో “తప్పు చేసినవాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే” అనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చెబుతున్నారని, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా న్యాయం జరగాలనే భావనతోనే జనసేన పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడలేక వైసీపీ నాయకులు కుల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని, అయితే ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులయ్యారని, కులాల పేరుతో సృష్టించే రాజకీయ డ్రామాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజంగా కాపు సామాజిక వర్గంపై ప్రేమ ఉంటే, వైసీపీ ప్రభుత్వం తమ పాలనలో కాపుల అభ్యున్నతి కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, సామాజిక సమైక్యతపై చర్చించాలని సూచించారు. కులాల పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగుస్తున్నాయని, సమాజాన్ని విభజించే రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయాలకు స్థానం ఉండదని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు.

వైసీపీ ఆత్మీయ సమావేశాలు రాజకీయ అవకాశవాదమేనని జనసేన నేత కిషోర్ విమర్శ.

Nellore: వైసీపీ నాయకులు కాపు సామాజిక వర్గంపై అకస్మాత్తుగా ప్రేమ చూపిస్తూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం రాజకీయ అవకాశవాదానికి నిదర్శనమని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల విమర్శించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు రిజర్వేషన్ల అంశంపై స్పష్టమైన వైఖరి చూపకపోవడమే కాకుండా, కాపు కార్పొరేషన్‌కు భారీ నిధులు కేటాయిస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. కాపు యువత విద్య, విదేశీ విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు నిలిచిపోయిన సమయంలో ఇప్పుడు ఆత్మీయ సమావేశాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.నేరం చేసిన వ్యక్తిని చట్టం ప్రకారం శిక్షించాల్సిందే తప్ప, ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కులానికి అంటగట్టడం సమంజసం కాదన్నారు. నేరస్థుడికి కులం, మతం, ప్రాంతం అనే భేదాలు ఉండవని, చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేశారు. వైసీపీ నాయకత్వం ప్రతి అంశాన్ని కుల కోణంలో చూడటానికి ప్రయత్నిస్తోందని, అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పదవులు, వైస్ ఛాన్సలర్ పోస్టులు, కాంట్రాక్టులు వంటి అవకాశాలను ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు. అప్పట్లో సామాజిక న్యాయం గురించి మాట్లాడని వారు ఇప్పుడు కులాల పేరుతో సమావేశాలు నిర్వహించడం ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నమేనని విమర్శించారు.నేటి యువత కులాలు, మతాలు దాటి సమానత్వం, అభివృద్ధి, అవకాశాల కోసం ఆలోచిస్తోందని, కానీ కొందరు రాజకీయ నాయకులు ఇంకా కుల విభజనల ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి రాజకీయాలు సమాజాన్ని వెనక్కి నెడతాయని హెచ్చరించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటి నుంచో “తప్పు చేసినవాడు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే” అనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చెబుతున్నారని, కులం, మతం, వర్గం అనే తేడా లేకుండా న్యాయం జరగాలనే భావనతోనే జనసేన పార్టీ ముందుకు సాగుతోందని తెలిపారు.ప్రజా సమస్యలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడలేక వైసీపీ నాయకులు కుల రాజకీయాలను ఆశ్రయిస్తున్నారని, అయితే ప్రజలు ఇప్పుడు చైతన్యవంతులయ్యారని, కులాల పేరుతో సృష్టించే రాజకీయ డ్రామాలను నమ్మే పరిస్థితి లేదన్నారు. నిజంగా కాపు సామాజిక వర్గంపై ప్రేమ ఉంటే, వైసీపీ ప్రభుత్వం తమ పాలనలో కాపుల అభ్యున్నతి కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటో ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు మానుకుని రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తు, సామాజిక సమైక్యతపై చర్చించాలని సూచించారు. కులాల పేరుతో రాజకీయాలు చేసే రోజులు ముగుస్తున్నాయని, సమాజాన్ని విభజించే రాజకీయాలను ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, భవిష్యత్తులో కూడా అలాంటి రాజకీయాలకు స్థానం ఉండదని కిషోర్ గునుకుల స్పష్టం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.