హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ అదృశ్యం
పున్నమి న్యూస్ మే 19 హయత్ నగర్ మండలం:
హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లక్ష్మీప్రియ కాలనీకి చెందిన భాను (వయస్సు: 21 సంవత్సరాలు) మహిళ 09-05-2026 తేదీన రాత్రి ఇంటి నుండి వెళ్లి తిరిగి ఇంటికి చేరుకోలేదు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, ఆమె భర్త బజార్ శివ పనిమీద నాదర్గుల్లో ఉండగా రాత్రి 12:47 గంటలకు ఫోన్లో మాట్లాడింది. అనంతరం భర్త ఇంటికి చేరుకునే సరికి ఆమె కనిపించలేదు. బంధువులు, పరిసర ప్రాంతాలలో వెతికినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తెలిపారు. ఆమె గురించి ఎవరికైనా సమాచారం తెలిసిన యెడల దయచేసి క్రింది నంబర్లకు సమాచారం అందించగలరు. 6301362509 హయత్ నగర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ తెలిపారు.



