ఆత్మకూరు, జూన్ 28 (హరికిరణ్, పున్నమి ప్రతినిధి):
స్థానిక ఎల్.ఆర్. పల్లి 1 సెంటర్, ఆత్మకూరు అంగన్వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఎస్‌ఆర్ హాస్పిటల్ అధినేత డాక్టర్ షకీలా, 3వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ గౌస్ బాషా, ఆత్మకూరు సెక్టార్ సూపర్‌వైజర్ జి. కస్తూరి హాజరై అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా డాక్టర్ షకీలా మాట్లాడుతూ అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల వయస్సు వరకు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. అనంతరం మాజీ వార్డు కౌన్సిలర్ గౌస్ బాషా మాట్లాడుతూ ప్రాంతంలోని లబ్ధిదారులు అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త షకీలా, ఆశా కార్యకర్త మహబూబ్ జానీ, ఇండియన్ క్రాస్ ప్రెసిడెంట్ ఎస్.డి. సాధిఖ్ పాల్గొన్నారు.


