స్వర్ణ నరేందర్ సతీమణి స్వర్ణ శిరీషకు ఏన్కూరు మండల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు
ఏన్కూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా స్వర్ణ నరేందర్ సతీమణి స్వర్ణ శిరీష నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. గతంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవలందించిన స్వర్ణ నరేందర్ స్థానంలో ఆయన సతీమణి స్వర్ణ శిరీషకు బాధ్యతలు అప్పగించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా స్వర్ణ శిరీష మాట్లాడుతూ మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తోందని, తన నియామకం అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారం, కార్యకర్తల సమన్వయానికి అంకితభావంతో పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ నియామకాన్ని మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్వాగతిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.


