ఏర్పేడు, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( ఏర్పేడు మండలం ఏర్పేడు కూడలిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బొజ్జల బృందమ్మ, మండలాధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నేతలు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి, అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టిడిపి జిందాబాద్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, మంత్రి నారా లోకేష్ నాయకత్వం బలపడాలని నినాదాలు మార్మోగాయి. ఈ సందర్బంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ.. దేశంలోనే విశిష్ట దార్శినికత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడిని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో నిలిపేందుకు ఆయన చేస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం, పేదరిక నిర్మూలన దిశగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఆయన దూరదృష్టిని ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయురారోగ్యాలతో దీర్ఘకాలం ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం పేరం నాగరాజు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారుఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఎర్పేడులో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుల్లో పాల్గొన్న బొజ్జల బృందమ్మ