Tuesday, 8 September 2026
  • Home  
  • స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాత మధు రాజీనామా చేయాలి: తెలుగు దేశం ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ వాసిరెడ్డి రామానాధం
- ఖమ్మం

స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. తాత మధు రాజీనామా చేయాలి: తెలుగు దేశం ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ వాసిరెడ్డి రామానాధం

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తాత మధుపై విమర్శలు చేశారు. నిన్న రాష్ట్ర శాసనసభ సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఏర్పడిన తోపులాట, ఘర్షణ సమయంలో తాత మధు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శాసనసభ గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అసభ్యకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిందని రామనాధం తెలిపారు. ఇక ఎలాంటి రుజువులు అవసరం లేదని, నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలకు తాత మధు సహకరించాలని సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయడమే మంచిదని డాక్టర్ వాసిరెడ్డి రామనాధం హితవు పలికారు.

శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ వాసిరెడ్డి రామనాధం డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తాత మధుపై విమర్శలు చేశారు.

నిన్న రాష్ట్ర శాసనసభ సమావేశానికి హాజరయ్యే క్రమంలో ఏర్పడిన తోపులాట, ఘర్షణ సమయంలో తాత మధు పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో శాసనసభ గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్న దళిత నేత గడ్డం ప్రసాద్ను ఉద్దేశించి అసభ్యకర పదజాలంతో దూషించినట్లు ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిందని రామనాధం తెలిపారు.

ఇక ఎలాంటి రుజువులు అవసరం లేదని, నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలకు తాత మధు సహకరించాలని సూచించారు. రాజకీయాలను పక్కనపెట్టి తన ఎమ్మెల్సీ పదవికి వెంటనే రాజీనామా చేయడమే మంచిదని డాక్టర్ వాసిరెడ్డి రామనాధం హితవు పలికారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.