ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని ఘనపూర్ (స్టేషన్), లింగాల ఘనపురం, జఫర్గడ్ మండలాల పరిధిలో గల 108 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు డ్రా నిర్వహణ
*అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు*
జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గంలోని ఘనపూర్ (స్టేషన్), లింగాల ఘనపురం, జఫర్గడ్ మండలాల పరిధిలో గల 108 డబుల్ బెడ్ రూమ్ (2BHK) గృహాలను అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గాను *అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా* అధ్యక్షతన డ్రా పద్ధతి ద్వారా పారదర్శకంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్* మాట్లాడుతూ.. లబ్ధిదారుల ఎంపిక కోసం మూడు వనరుల నుంచి అర్హుల జాబితా సిద్ధం చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల L2 జాబితా, ప్రజావాణి దరఖాస్తుదారులు, ప్రజాప్రతినిధులు లిఖితపూర్వకంగా అందజేసిన పేర్లు – ఈ మూడు జాబితాల్లోని ప్రతి అర్హ కుటుంబాన్ని ఏకీకృత జాబితాలో చేర్చినట్లు చెప్పారు.
డ్రా మొత్తం వీడియో చిత్రీకరణతో, జిల్లా స్థాయి కమిటీ సమక్షంలో ఇన్-కెమెరా విధానంలో చేపట్టడం జరిగిందన్నారు.
డ్రా పూర్తిగా రెండు దశల్లో ఉంటుందని, మొదటి దశలో అర్హ కుటుంబాల ఎంపిక, రెండో దశలో ఎంపికైన కుటుంబాలకు ఫ్లాట్ కేటాయింపు జరుగుతుందని చెప్పారు.
డ్రా అనంతరం ఎంపికైన కుటుంబాలకు తాత్కాలిక కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి, మండల స్థాయి బృందాలు అర్హతలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాయని తెలిపారు. అర్హత నిర్ధారణ అనంతరం తుది కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసి గృహాల స్వాధీనం కల్పిస్తామని వెల్లడించారు.
ఎంపిక జాబితాలు గ్రామ పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించడంతో పాటు జిల్లా వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు.
*2బీహెచ్‌కే ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక వివరాలిలా ఉన్నాయి..*
ఘనపూర్ (స్టేషన్) మండలం, పామ్నూర్ గ్రామ పంచాయతీలో గల మొత్తం 57 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా పామ్నూర్ గ్రామ పంచాయతీలో గల 40 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 40 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 8 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు
లింగాల ఘనపురం మండలం, కళ్లెం గ్రామ పంచాయతీలో గల మొత్తం 65 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా పామ్నూర్ గ్రామ పంచాయతీలో గల 30 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 30 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 6 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు
జఫర్గడ్ మండలం, తిమ్మంపేట గ్రామ పంచాయతీలో గల మొత్తం 34 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా తిమ్మంపేట గ్రామ పంచాయతీలో గల 25 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 25 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
జఫర్గడ్ మండలం, తమ్మడపల్లి గ్రామ పంచాయతీలో గల మొత్తం 19 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేశారు.
ఇందులో భాగంగా వావిలాల గ్రామ పంచాయతీలో గల 13 రెండు పడక గదుల ఇళ్లకు డ్రా ద్వారా 13 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. అదే విధంగా 5 మంది వెయిటింగ్ లిస్ట్ లబ్ధిదారులను కూడా డ్రా ద్వారా ఎంపిక చేశారు.
ఈ కార్యక్రమంలో ఘనపూర్ (స్టేషన్) ఆర్డీఓ కిరణ్ ప్రకాష్, ఆడిట్ అధికారి దేవేందర్, లింగాల ఘనపురం, జఫర్గడ్, ఘనపూర్ (స్టేషన్) తహసీల్దార్లు స్వప్న, శ్రీనివాస్, ఆండాలు, తదితరులు పాల్గొన్నారు.

