*సేవా స్ఫూర్తితో మదర్ థెరిసా జయంతి వేడుకలు*
*ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, పాలు, బ్రెడ్ పంపిణీ*
*మైలవరం,*()పున్నమి న్యూస్ ప్రతినిథి
మదర్ థెరిసా ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధ ఆధ్వర్యంలో మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక తిరువూరు రోడ్డులోని మదర్ థెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు బ్రెడ్, పాలు, పండ్లను పంపిణీ చేశారు. మదర్ థెరిసా సేవలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షురాలు కోయ సుధ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మదర్ థెరిసా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మదర్ థెరిసా సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అనాథలకు వివిధ రకాల సేవలను అందిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, వెల్వడం యువత, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, గైనకాలజిస్టులు ఆశాజ్యోతి, నిఖిత, వెల్వడం మదర్ థెరిసా ఆర్‌సీఎం చర్చి సభ్యులు నాగమణి, ధనలక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, దయాకర్ తదితరులు పాల్గొన్నారు.



