అనపర్తి, సెప్టెంబర్ 15 (పున్నమి ప్రతినిధి): ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాలపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనపర్తి మండలం రామవరంలో అనపర్తి, బిక్కవోలు మండలాలకు చెందిన కూటమి నాయకులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సెప్టెంబర్ 17న నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలతో పాటు, నెల రోజులపాటు చేపట్టనున్న వివిధ సేవా కార్యక్రమాలపై ఎమ్మెల్యే నాయకులు, అధికారులతో చర్చించారు. కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించి విజయవంతం చేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ రూపొందించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నెల రోజులపాటు నిర్వహించే కార్యక్రమాల షెడ్యూల్, బాధ్యతలు, ఏర్పాట్లపై సమావేశంలో చర్చించారు.



