Tuesday, 22 September 2026
  • Home  
  • సూర్య ప్రైవేట్ ఐటీఐలో ఏటికొప్పాక జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థుల విద్యా పర్యటన
- అనకాపల్లి

సూర్య ప్రైవేట్ ఐటీఐలో ఏటికొప్పాక జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థుల విద్యా పర్యటన

ఎలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్ ఏటికొప్పాక గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9, 10 తరగతుల ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు సెప్టెంబర్ 16న సూర్య ప్రైవేట్ ఐటీఐని విద్యా పర్యటనలో భాగంగా సందర్శించారు. హెచ్‌ఎం ఎం. రమణ పర్యవేక్షణలో ఒకేషనల్ ఉపాధ్యాయులు కుమార్ (ఎలక్ట్రానిక్స్), మనోజ్ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది. విద్యార్థులు ఐటీఐలోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్‌లను పరిశీలించి, వివిధ రకాల సర్క్యూట్లు, టెస్టింగ్ పరికరాలు, యంత్రాల పనితీరును ఆసక్తిగా తెలుసుకున్నారు. ఐటీఐ అధ్యాపకులు పరికరాల వినియోగం, సాంకేతిక అంశాలను వివరించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న మార్కెట్‌ డిమాండ్‌, భవిష్యత్‌ ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. తరగతి గది విద్యతో పాటు ప్రాక్టికల్‌ విజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడిందని హెచ్‌ఎం రమణ తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు వారికి అవసరమైన సూచనలు అందించారు.

ఎలమంచిలి :పున్నమి ప్రతినిధి ఆనంద్

ఏటికొప్పాక గ్రామం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 9, 10 తరగతుల ఒకేషనల్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు సెప్టెంబర్ 16న సూర్య ప్రైవేట్ ఐటీఐని విద్యా పర్యటనలో భాగంగా సందర్శించారు. హెచ్‌ఎం ఎం. రమణ పర్యవేక్షణలో ఒకేషనల్ ఉపాధ్యాయులు కుమార్ (ఎలక్ట్రానిక్స్), మనోజ్ ఆధ్వర్యంలో పర్యటన జరిగింది. విద్యార్థులు ఐటీఐలోని ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ల్యాబ్‌లను పరిశీలించి, వివిధ రకాల సర్క్యూట్లు, టెస్టింగ్ పరికరాలు, యంత్రాల పనితీరును ఆసక్తిగా తెలుసుకున్నారు. ఐటీఐ అధ్యాపకులు పరికరాల వినియోగం, సాంకేతిక అంశాలను వివరించారు. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్న మార్కెట్‌ డిమాండ్‌, భవిష్యత్‌ ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. తరగతి గది విద్యతో పాటు ప్రాక్టికల్‌ విజ్ఞానం, పారిశ్రామిక నైపుణ్యాలపై ప్రత్యక్ష అవగాహన కల్పించేందుకు ఈ పర్యటన దోహదపడిందని హెచ్‌ఎం రమణ తెలిపారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు సందేహాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు వారికి అవసరమైన సూచనలు అందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.