సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఈ నియామకాలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. దీంతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 37కు చేరింది. పంజాబ్-హర్యానా, బాంబే, మధ్యప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులతో పాటు సీనియర్ న్యాయవాది వి. మోహనకు అవకాశం కల్పించారు. మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన అనేక కీలక కేసుల్లో వాదించిన న్యాయవాదిగా వి. మోహనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. న్యాయవ్యవస్థ పనితీరును మరింత బలోపేతం చేయడంలో ఈ నియామకాలు కీలకంగా మారనున్నాయి.

సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తుల నియామకం