వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా చిట్వేలికి చెందిన వైసీపీ నాయకుడు మలిశెట్టి వెంకటరమణ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై . స్ . జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు ఆయన శనివారం తెలిపారు. పార్టీ తన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించడం పట్ల మలిశెట్టి వెంకటరమణ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి, రాయలసీమ ప్రాంత సమన్వయకర్త పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కు, రాజంపేట పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డికి, కోడూరు మాజీ శాసనసభ సభ్యుడు కొరముట్ల శ్రీనివాసులకు, చిట్వేల్ మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డికి, చిట్వేలి గ్రామ మాజీ ఉప సర్పంచ్ చౌడవరం ఉమామహేశ్వర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరింత కృషి చేస్తానని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని మలిశెట్టి వెంకటరమణ పేర్కొన్నారు. ఆయన నియామకంపై చిట్వేల్ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

