Tuesday, 16 June 2026
  • Home  
  • సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత*
- ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత*

అనారోగ్యంతో బాధపడు తున్న పేద వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎంవీపీ కాలనీ క్యాంప్ కార్యాలయంలో 26 మందికి రూ.15.53 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా దన్నుగా నిలిచేలా గతం కంటే ఎక్కువగా సీఎం రిలీఫ్ ఫండ్ విడుదల చేస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలైన ఆనందపురం మండలం నుంచి ఏడుగురికి, పద్మనాభం మండలం నుంచి ఇద్దరికి, భీమిలి రూరల్ నుంచి ఒకరికి చెక్కులిచ్చారు. అలాగే జీవీఎంసీ 3 వార్డు, 98 వార్డుల నుంచి ముగ్గురు చొప్పున, 4, 6, 7 వార్డుల నుంచి ఇద్దరు చొప్పున, 2, 5 వార్డుల నుంచి ఒకొక్కరికి ఆర్థిక సాయాన్ని అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు చిక్కాల విజయ్ బాబు, కోరాడ రమణ, మజ్జి నందీశ్వరరావు, తాట్రాజు అప్పారావు, లొడగల వెంకట్రావు, గాడు చిన్ని కుమారి లక్ష్మి, గంటా నూకరాజు, శ్రీకాంత్ రాజు, గొలగాని నరేంద్ర, పాసి నరసింగరావు, సూరిబాబు, నాగోతి సత్యనారాయణ, కానూరు అచ్యుతరావు, గరే గుర్నాథ్, మొల్లి లక్ష్మణరావు, మాన్యాల సోంబాబు, వాండ్రాసి వాండ్రాసి అప్పలరాజు, అల్లు చిన్నయ్య శ్రీరామూర్తి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.