*సి సి రోడ్డు నిర్మించారు…. సైడ్ డ్రెయిన్ మరిచారు*
*సొంత గా డ్రైనేజీ నిర్మించుకుంటున్న గిరిజన మహిళ*
*లచ్చగూడెం ఎస్టి కాలనీ లో వైనం*
ఖమ్మం జిల్లా బ్యూరో జులై 28 గాండీవం
ఏన్కూరు :
ప్రభుత్వాలు ఎన్ని మారిన ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి అనే ఆరోపణలు బహిరంగ వినిపిస్తున్నాయి. స్వతంత్రం వచ్చి ఏళ్ళు గడుస్తున్న గిరిజన ప్రజల సమస్యలకు మోక్షం ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తున్నారు. మండల పరిధిలోని లచ్చగూడెం ఎస్సీ కాలనీలో డ్రైనేజీ సమస్యతో గిరిజన మహిళ ఇబ్బంది పడి. కాలువలో ఆగిన డ్రైనేజీ నీరు దుర్వాసన వెదజల్లడంతో, ఇల్లు లేక కాలం నెట్టుకొస్తున్న వాగబోయిన వెంకట రమణమ్మ తన సొంత ఖర్చుతో సిమెంటు, ఇసుక, ఇటుకలు కొనుగోలు చేసి, స్వయంగా డ్రైనేజీ నిర్మించుకోవడంతో అధికారుల ఏమయిపోయారని చూసినవారు ముక్కున వేలేసుకుంటున్నారు. లక్షల రూపాయలు వెచ్చించి డ్రైనేజీలు నిర్మాణం జరిపిన గిరిజన ప్రజలకు డ్రైనేజీ సమస్య అంతంతం మాత్రంగా ఉండటంతో గిరిజన మహిళ వాగబోయిన వెంకటరమణమ్మకు ఆర్థిక భారం అయినప్పటికీ సమస్య పరిష్కారం కోసం తానే రంగంలో దిగింది. సొంతగా డ్రైనేజీ నిర్మించుకుంటున్న వెంకటరమణమ్మకు పలువురు హ్యాండ్సప్ చెప్పారు.


